మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్
చిన్నారులకు తమ తమ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జల్ పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కో- ఆర్డినేటర్ షేక్ జహంగీర్ అన్నారు. జల్ పల్లి ప్రభుత్వ స్కూల్లో చిన్నారులకు ఆయన పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ప్రపంచ వ్యాప్తంగా పోలియో అంటే పెద్ద వ్యాధిగా భావించి ప్రజలందరూ భయపడేవారన్నారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా పంపిణీ చేస్తున్న పల్స్ పోలియో వ్యాక్సిన్ ను గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఐదేండ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజానికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు యంజాల శ్రీనివాస్, నవాజ్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.